banner

IPL 2024: ఆర్సీబీ, పంజాబ్ జట్లకు చావో రేవో మ్యాచ్.. ఓడితే ఇంటికే

Written by

IPL 2024లో అత్యంత ముఖ్యమైన గేమ్ ఈరోజు ఆడనుంది. ఈ సీజన్‌లో 58వ మ్యాచ్ చివరి బంతి వరకు విజయం కోసం పోరాడుతున్న పంజాబ్ జట్లు మరియు సీజన్ ప్రారంభం నుండి ట్రోఫీ కోసం ఎదురుచూస్తున్న RCB మధ్య జరగనుంది. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల వేదికగా ఈ మ్యాచ్ జరగనుండగా.. ఇరు జట్లకు గెలుపు అనివార్యం అయింది. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 11 మ్యాచులు ఆడి నాలుగు విజయాలతో ఆర్సీబీ 7వ స్థానంలో, పంజాబ్ 8వ స్థానంలో కొనసాగుతన్నాయి. వీరికి మరో మూడు మ్యాచులు ఉండగా ప్లేఆఫ్ చేరాలంటే ప్రతి మ్యాచ్ లో విజయం సాధించాల్సి ఉంది. కాగా ఈ రోజు జరిగే మ్యాచ్ లో ఎ జట్టు అయితే ఓడిపోతుందో అధికారింగా ప్లే ఆఫ్ నుంచి ఎలిమినేట్ అయ్యే రెండో జట్టు గా నిలవనుంది. కాగా ఆర్సీబీ జట్టు వరుసగా మూడు విజయాలతో ప్లే ఆఫ్ కోసం దూసుకొస్తుండగా.. పంజాబ్ చివరి మ్యాచులో ఓడిపోయి గెలుపు కోసం చూస్తుంది. మరి ఈ రోజు రాత్రి జరిగే మ్యాచ్ లో ఎవరు గెలిచి ప్లే ఆఫ్ రేసులో కొనసాగుతారో తెలియాలంటే మ్యాచ్ పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందే మరి.

Article Categories:
క్రీడలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *