banner

ముంబై అభిమానులకు శుభవార్త: జట్టులోకి భారీ హిట్టర్

Written by

ఐపీఎల్ 2024 లో వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై జట్టుకు భారీ శుభవార్త అందింది. ముంబై జట్టు ఈ సీజన్ లో ఇప్పటి వరకు మూడు మ్యాచులు ఆడగా.. మూడింటిలోనూ చిత్తుగా ఓడిపోయి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది. కాగా ముంబై జట్టుకు మిడిల్ ఆర్డర్ లైనప్ లో వెన్నుముకగా ఉన్న సూర్యకుమార్ యాదవ్ గాయం కారణంగా మొదటి మూడు మ్యాచులకు దూరం అయ్యారు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న సూర్య ఢిల్లీతో జరిగే మ్యాచుకు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ముంబై జట్టులో మంచి ఫినిషర్‌గా పేరుగాంచిన సూర్య తిరిగి వస్తుండటంతో ముంబై అభిమానుల్లో జోష్ నెలకొంది. కాగా దీనిపై సూర్య క్లారిటీ ఇస్తూ.. తన ట్విట్టర్ ఖాతాలో బ్యాక్ హోమ్ అంటూ రెండు ఫోటోలను షేర్ చేశారు. కాగా ఆదివారం డబుడెక్కర్ మ్యాచుల్లో భాగంగా మొదటి మ్యాచుల్లో మధ్యహ్నం ఢిల్లీ, ముంబై జట్ల మధ్య ముంబై హోమ్ గ్రౌండ్ అయిన వాంఖడే స్టేడియంలో మ్యాచ్ జరగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *