banner

మహిళలకు ఫ్రీ జర్నీ ఎఫెక్ట్.. భారీగా తగ్గిన బస్ పాసులు..!

Written by

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపట్టిన మహిళాలకు ఉచిత ప్రయాణం నెలవారీ బస్ పాస్‌ల సంఖ్యను తగ్గించడానికి దారితీసింది. హైదరాబాద్ ఆర్టీసీ బస్సుల్లో గతంలో 11 లక్షల మంది ప్రయాణిస్తే, ఇప్పుడు ఆ సంఖ్య 21 లక్షలకు చేరింది. అయితే బస్సు చార్జీలు 40 శాతం తగ్గినట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ గణాంకాలు చెబుతున్నాయి. గత మూడు నెలలుగా నగరంలో ఇంత తగ్గుదల కనిపిస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం నగరంలో 1 లక్ష, 60,000 స్టూడెంట్ బస్ పాస్‌లు, 90,000 జనరల్ పాస్‌లు, 30,000 వికలాంగుల పాస్‌లు, 2,000 NGO పాస్‌లు ఉన్నాయి. గ్రేటర్‌ పరిధిలో అన్ని రకాల పాస్‌లు కలిపి 2 లక్షల 82 వేలు ఉన్నాయి. మహాలక్ష్మి పథకం అందుబాటులోకి రావడంతో నగరంలో ఉండే అన్ని రకాల బస్ పాస్​లపై ప్రభావం పడింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో 7 లక్షలకు పైగా బస్ పాస్‌లు తర్వాత 4.50 లక్షలకు పడిపోయాయి. కరోనా తర్వాత 3.9 లక్షల వరకు తగ్గిపోయాయి. మహాలక్ష్మి పథకం అమలు తర్వాత బస్ పాస్​ల సంఖ్య 2.82 లక్షలకు పడిపోయినట్లు ఆర్టీసీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నగరంలో ప్రస్తుతం 2850 బస్సులు తిరుగుతున్నాయి. దీని కోసం మరో 7,500 వరకు బస్సులు అవసరమని ఆర్టీసీ పేర్కొంది. ఈ బస్సుల సంఖ్య పెరిగే కొద్దీ టిక్కెట్ల సంఖ్య కూడా పెరుగుతుందని ప్రజా రవాణా రంగ నిపుణులు అంటున్నారు.

Article Categories:
వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *