banner

హైదరాబాద్: కేబుల్ బ్రిడ్జిపై హిట్ అండ్ రన్.. యువకుడు స్పాట్ డెడ్

Written by

మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్థరాత్రి గుర్తుతెలియని కారు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి ప్రాథమిక సమాచారం మేరకు.. అనిల్ (25 ఏళ్ల) అర్ధరాత్రి మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై తన స్నేహితులతో కలిసి ఫొటోలు దిగుతున్నాడు. అదే సమయంలో వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం అనిల్‌తో పాటు అతని స్నేహితున్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో అనిల్ అక్కడిక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదానికి కారణమైన కారును గుర్తించేందుకు పోలీసులు సిసిటీవి ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై మహాపూర్ పోలీసులు ఫిర్యాదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Article Categories:
వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *