banner

SA-2 పరీక్షలు వాయిదా, విద్యా మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది

Written by

ఏటా 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు నిర్వహించే ఎస్ఏ పరీక్షల నిర్వహణకు సంబంధించి తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిర్వహించ తలపెట్టిన పరీక్షలను ఏప్రిల్‌ 15 వరకు వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు అధికారికంగా ప్రకటించారు. అయితే, వాస్తవానికి అంతకు ముందు ఏప్రిల్ 8 నుంచి 19 వరకు పరీక్షలు నిర్వహించాలని అనుకున్నప్పటికీ మళ్లీ అనూహ్యంగా విద్యాశాఖ తేదీని మార్పులు చేసింది. దీంతో ఈ నెల 15 నుంచి 22 వరకు ఎస్‌ఏ -2 పరీక్షలను నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. 1 నుంచి 7వ తరగతి వరకు ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే, 8వ తరగతి వారికి ఉదయం 9 గంటల నుంచి 11:45 గంటల వరకు, 9వ తరగతి వారికి ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నిర్వహించనున్నారు. ఇక ఏప్రిల్ 23న పేరెంట్స్ మీటింగ్స్ నిర్వహించి తుది ఫలితాలను ప్రకటించనున్నారు. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు ప్రభుత్వం ఇప్పటికే పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించింది. కాగా, ఎస్‌ఏ-2 పరీక్షల వాయిదా పడిన క్రమంలో ఆయా జిల్లాల్లో డీఈవోలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు గమనించాలని విద్యాశాఖ అధికారుల సూచిస్తున్నారు.

Article Categories:
వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *