
తెలంగాణలో ఎక్కడ చూసినా ఎండలు మండుతున్నాయి. విపరీతమైన వేడిమికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఇష్టపడడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరుకుంటున్నాయని, ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. నల్గొండ జిల్లా నడమనూరులో ఇప్పటికే 43.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవగా, రాష్ట్ర వ్యాప్తంగా రేపు, ఎల్లుండి వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని, వృద్ధులు మరియు పిల్లలు మధ్యాహ్నం బయటకు వెళ్లవద్దని కోరారు.
Article Categories:
వార్తలు
