banner

వీహెచ్ షాకింగ్ కామెంట్స్: నాకు MP టికెట్ రాకుండా భట్టి అడ్డుకుంటున్నారు

Written by

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీహెచ్ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. తనకు ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ తనకు రాకుండా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అడ్డుపడుతున్నారని ఆరోపించారు. తన భార్యకు ఎంపీ టికెట్ కోసం భట్టి ప్రయత్నిస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని తానే సలహా ఇచ్చానని.. అందుకే భట్టికి తనపై కోపం ఉందని షాకింగ్స్ కామెంట్స్ చేశారు. దానిని మనసులో పెట్టుకుని తనకు ఎంపీ టికెట్ రాకుండా భట్టి అడ్డుకుంటున్నారని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తల్చుకుంటే తనకు ఖమ్మం ఎంపీ టికెట్ వస్తుందన్నారు. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ తనకే దక్కుతుందనే నమ్మకం ఉందన్నారు. కాగా, ఖమ్మం ఎంపీ టికెట్‌కు కాంగ్రెస్‌లో భారీ డిమాండ్ ఉంది. ఈ టికెట్ కోసం భట్టి, మంత్రి పొంగులేటి సోదరుడు, భట్టి సతీమణి, మంత్రి తుమ్మల కొడుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే, తనకు టికెట్ రాకుండా భట్టి పడుతున్నారని మొదటి నుండి వీహెచ్ ఆరోపిస్తున్నారు. వీహెచ్ వ్యాఖ్యలపై గతంలోనే ఓ సారి భట్టి క్లారిటీ ఇచ్చినప్పటికీ.. వీహెచ్ మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Article Categories:
రాజకీయాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *