banner

సినీ హీరో రామ్ చరణ్ కు అరుదైన గౌరవం!.. ప్రముఖ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్

Written by

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి అరుదైన గౌరవం దక్కింది. చెన్నైలోని ఓ ప్రముఖ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయనుంది. చెన్నైలోని వేల్స్ వర్చువల్ యూనివర్సిటీ స్నాతకోత్సవ వేడుకలు ఈ నెల 13న జరగనున్నాయి. ఈ వేడుకలు సినీ నిర్మాత, యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ అయిన ఈసరి గణేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలుగు సినీ హీరో రామ్ చరణ్ తేజ్ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు.
ఇదే వేడుకలో కళా రంగానికి చేస్తోన్న అత్యుత్తమ సేవను గుర్తించిన వేల్స్ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయనుంది. ఈ పురస్కారాన్ని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అధ్యక్షుడు డీజీ సీతారాం రామ్ చరణ్ కు అందజేయనున్నారు. ఇక తమ హీరోకి సినిమా రంగంలోకి వచ్చిన కొన్ని సంత్సరాలలోనే అరుదైన గౌరవడం దక్కడం పట్ల మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా ప్రస్తుతం రామ్ చరణ్ తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ ఛేంజర్ అనే మూవీలో నటిస్తున్నాడు.

Article Categories:
సినిమా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *