
గుడిలో ఎవరూ లేని సమయంలో కొందరు వ్యక్తులు భక్తుడిలా వచ్చి దొంగతనాలకు పాల్పడుతున్నారు. గుడిలో హుండీ, దేవుని ఆభరణాలు, ఇతర వస్తువులు దోచుకోని పోయిన సంఘటనలు ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ గుడిలోకి భక్తుడిలా వచ్చిన వ్యక్తి చోరి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఏలూరు సత్రంపాడు సౌభాగ్యలక్ష్మీ ఆలయంలో చోరీ జరిగింది. దర్శనం కోసం ఆలయానికి వచ్చిన ఓ వ్యక్తి.. అమ్మవారి మెడలోని 10 కాసుల మంగళసూత్రాన్ని అపహరించాడు.
అమ్మవారికి ముందుగా దండం పెట్టి.. అటు ఇటు చూసి గర్భగుడిలోకి వెళ్లీ అమ్మవారి మంగళసూత్రం కాజేస్తాడు. ఇదంతా కూడా సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. అతను దొంగతనం చేసే సమయంలో మాస్క్ ధరించాడు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియో పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. దొంగకు భయం, భక్తి లేదని నెటిజన్లు ఫైర్ అయ్యారు.
Article Categories:
వార్తలు
