banner

సింగరేణి కార్మికుల కుటుంబాలకు శుభవార్త

Written by

సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కారుణ్య నియామకాల వయోపరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 35 ఏళ్లు ఉన్న వయోపరిమితిని 40 ఏళ్లకు పెంచుతూ మంగళవారం సింగరేణి సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నది. 2018 మార్చి 9 కటాఫ్ తేదీ నుంచి ఈ ఆదేశాలు అమలు చేస్తున్నట్లు సింగరేణి సీఎండీ వెల్లడించారు. ఈ ఉత్తర్వులతో 300 మంది నిరుద్యోగులు తక్షణమే లబ్ది పొందనున్నారు. దీంతో సింగరేణి కార్మికుడు మెడికల్‌ ఇన్‌వ్యాలిడేషన్‌కు గురైనా, మరణించినా కారుణ్య నియామకాల్లో వారసులకు ఉద్యోగాలు కల్పిస్తారు.

Article Categories:
వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *