banner

మహిళా శక్తి క్యాంటీన్లకు ప్రభుత్వం శ్రీకారం – నేడు ప్రారంభించనున్న మంత్రి సీతక్క

Written by

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళ అభివృద్ధి, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న విషయం విదితమే. ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్లు కరెంటు బిల్లు ఉచితం, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. మరోవైపు మహిళా సంఘాల ఆర్థిక బలోపేతానికి తాజాగా మహిళా శక్తి క్యాంటీన్లు కూడా తెచ్చారు. ఈ క్రమంలోనే శుక్రవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రెండు మహిళా శక్తి క్యాంటీన్లు పంచాయతీ రాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, సీఎస్ శాంతికుమారి ప్రారంభించారు. కాగా, రెండేళ్లలో జిల్లాకు ఐదు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 150 క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మహిళా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్లు, ఆస్పత్రులు, దేవాలయాలు, బస్టాండ్లు, పారిశ్రామిక, పర్యాటక ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *