banner

బాబాయ్ కోసం రంగంలోకి కొడుకు..

Written by

ఏపీ ఎన్నికలు దగ్గరపడుతోన్న కొద్ది ప్రచారాల జోరు ఊపందుకుంటోంది. ఈ క్రమంలో పలువురు సినీ సెలబ్రిటీలు కూడా పలు పార్టీల తరపున మద్దతు పలుకుతున్నారు. ఇక, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. పవన్ ఇటీవలే పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. కాగా, నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ బాబాయి పవన్ కల్యాణ్ తరపున రేపు (ఏప్రిల్ 27) ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మెగా ఫ్యాన్స్.. ‘అందరూ రండి మా పవన్ అన్నను గెలిపించండి’ అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Article Categories:
సినిమా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *