
SRH మరియు ముంబై ఇండియన్స్ మధ్య IPL 2024 మ్యాచ్ బుధవారం ఉప్పల్ స్టేడియంలో జరిగింది. అయితే ముంబై ఫ్రాంచైజీ యజమాని, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ మ్యాచ్ చూసేందుకు హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఆమె సికింద్రాబాద్లోని ప్రముఖ బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం ఎల్లమ్మ, పోచమ్మ అమ్మవార్లకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బల్కంపేట ఎల్లమ్మ విశిష్టతను ఆలయ నిర్వాహకులు ఆమెకు వివరించారు. అనంతరం వేదపండితులు తీర్థ, ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. అయితే నీతా అంబానీ దాదాపు 15 నిమిషాల పాటు ఆలయంలో గడిపారు.
Article Categories:
క్రీడలు
