banner

హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్లే వారికి TSRTC శుభవార్త

Written by

వేసవి సెలవుల్లో ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్-బెంగళూరు రూట్‌లో ప్రయాణించే ప్రయాణికులకు ముందుగా బుక్ చేసుకునే వారికి తిరిగి వచ్చే ఛార్జీలపై 10% తగ్గింపును టీఎస్ ఆర్టీసీ అందిస్తోంది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లే అన్ని హై ఎండ్ సర్వీసుల్లోనూ ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపింది. ఈ రూట్లలో వెళ్లే ప్రయాణికులు 10 శాతం రాయితీని వినియోగించుకుని.. టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో క్షేమంగా గమ్య స్థానాలకు చేరుకోవాలని సంస్థ కోరుతుందని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. ఇక ఈ రూట్‌లో మొత్తం 26 బస్సుల్లో ఈ బుకింగ్ సౌకర్యం ఉందని ఆర్టీసీ తెలిపింది.

Article Categories:
వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *