banner

ఇంటర్ క‌ళాశాల‌కు వేసవి సెలవులు…ఎప్ప‌టినుంచంటే..?

Written by

తెలంగాణలోని ఇంటర్ క‌ళాశాల‌ల‌కు విద్యాశాఖ వేసవి సెలవులు ప్రక‌టించిన విషయం తెలిసిందే. ఇంట‌ర్ పరీక్షలు ముగిసిన క్రమంలో ఇంట‌ర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఈ సంవ‌త్సరం ఇంటర్ విద్యార్థులకు మార్చి 30వ తేదీ నుంచి విద్యార్థులకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జూనియర్‌, ఎయిడెడ్ ఇంటర్‌ కాలేజీలకు మార్చి 30వ తేదీ నుంచి మే31వ తేదీ వరకు సెలవులు ఉండ‌నున్నట్లు ఇంట‌ర్ బోర్డు వెల్లడించింది. జూన్ 1వ తేదీ నుంచి ఇంటర్ కాలేజీలు ప్రారంభమవుతాయి. కాగా, ఈ సంవ‌త్సరం మొత్తం 9 లక్షల మంది విద్యార్థులు ఇంట‌ర్ పరీక్షలకు హాజరయ్యారు.

Article Categories:
వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *