
తొలి తెలుగు టీవీ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ శుక్రవారం కన్నుమూశారు. యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన గుండెపోటుతో రెండు రోజుల క్రితం యశోద ఆస్పత్రిలో చేరారు. తెలుగులో తొలిసారి వార్తలను శాంతి స్వరూప్ చదివారు. పదేళ్లపాటు టెలీ ప్రాంప్టర్ లేకుండా పేపర్ చూసి వార్తలను ఆయన చదివి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తొలి తెలుగు న్యూస్ రీడర్ గా తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నారు. 1983 నవంబర్ 14న దూరదర్శన్ లో శాంతి స్వరూప్ వార్తలు చదివారు. 2011లో పదవీ విరమణ చేసే వరకు వార్తలను ఆయన చదివారు. తన సేవలకు గాను లైప్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును ఆయన అందుకున్నారు. శాంతి స్వరూప్ కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
Article Categories:
వార్తలు
