banner

సంగారెడ్డి జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఆరుగురు కార్మికులు చనిపోయారు

Written by

కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండల పరిధిలోని చందాపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చందాపూర్లోని ఎస్‌బీ కెమికల్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా రియాక్టర్ పేలడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కంపెనీ యాజమాన్యం సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

Article Categories:
వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *