
కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండల పరిధిలోని చందాపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చందాపూర్‌లోని ఎస్బీ కెమికల్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా రియాక్టర్ పేలడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కంపెనీ యాజమాన్యం సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
Article Categories:
వార్తలు
