banner

హైదరాబాద్ వాసులకు అలెర్ట్…రేపు పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు!

Written by

రేపు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం నగరంలోని ప్రత్యేక ప్రార్థనలు జరిగే మిరాలం, ఈద్గా పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. పాతబస్తీలోని పలు రోడ్లపై వాహనాల రాకపోకలను నిలిపి వేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 8 నుంచి 11.30 వరకు మీరాలం ఈద్గా ప్రాంతంలో వాహనాలను వేరే మార్గాలకు మళ్లిస్తున్నట్లు వెల్లడించారు. ఈద్గాకు ప్రార్థనల కోసం వచ్చే వారిని మాత్రమే అనుమతించనున్నట్లు వివరించారు.

Article Categories:
వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *