banner

బిడ్డా, ఖబర్ధార్.. రేవంత్ రెడ్డికి బండి సంజయ్ వార్నింగ్

Written by

రేవంత్ రెడ్డికి భయంతో గాడిదగుడ్డులో కూడా నరేంద్ర మోడీ కనిపిస్తున్నాడని కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్ధి బండి సంజయ్ వ్యాఖ్యానించాడు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన మాటలను ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసిన ఆయన రేవంత్ రెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ప్రచారంలో ఓ గుడ్డు ముందు పెట్టుకొని నరేంద్ర మోడీ గాడిద గుడ్డు ఇచ్చిండ అని మాట్లాడుతున్నాడని తెలిపాడు. రేవంత్ రెడ్డికి మోడీ అంటే భయం మొదలైందని, అందుకే గుడ్డు చూపెడుతూ.. భయంతో ఆ గుడ్డులో కూడా మోడీనే చూస్తున్నాడని ఎద్దేవా చేశారు. నరేంద్ర మోడీ పేదలకు ఉచిత రేషన్ బియ్యం ఇచ్చాడని, స్వచ్ఛ భారత్ పేరుతో టాయిలెట్లు కట్టించాడని, ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చాడని, ఇవన్నీ రేవంత్ రెడ్డికి గాడిదగుడ్డులా కనిపిస్తున్నాయా? అని మండిపడ్డారు. పేదలకు 2500 ఇస్తా అని మోసం చేశారని, 4000 వేల పించన్ ఇస్తా, తులం బంగారం ఇస్తా అని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గాడిద గుడ్డుతో సమానం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దానిపై నరేంద్ర మోడీ గారు ప్రజలకు మేలు చేస్తే అది కాంగ్రెస్ పార్టీకి గాడిద గుడ్డు కానీ, 6 గ్యారెంటీలంటూ హామిలిచ్చి నయవంచన చేసి ప్రజలను మోసగించడం కాంగ్రెస్ నేతలకు వెరీగుడ్డు అంటూ స్థాయి హోదా మరిచి నిందలేస్తే తెలంగాణ ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తరు, నిలువరిస్తరు బిడ్డా, ఖబర్ధార్ అని బండి సంజయ్ ఎక్స్ వేదికగా హెచ్చరించారు.

Article Categories:
రాజకీయాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *