banner

‘సుప్రీం కోర్టులో సవాల్ చేస్తా’.. అనర్హత వేటుపై MLC దండె విఠల్ స్పందించిన

Written by

ఎమ్మెల్సీగా తన ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దండే విఠల్ స్పందించారు. ఈ విషయమై శుక్రవారం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. నా ఎన్నిక చెల్లదని హై కోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీం కోర్టులో సవాల్ చేస్తానని స్పష్టం చేశారు. వేరే అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ సరిగా జరగలేదన్న కారణంతో ఈ తీర్పు వచ్చిందని చెప్పారు. పక్క పార్టీ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ నాకు సంబంధం లేని వ్యవహారమని క్లారిటీ ఇచ్చారు. ఏది ఏమైనా ఈ తీర్పుపై అప్పీల్‌కు వెళ్తానని స్పష్టం చేశారు. తీర్పును ఛాలెంజ్ చేసేందుకు నాలుగు వారాల గడువు ఉందని తెలిపారు. సుప్రీంకోర్టులో న్యాయం జరిగి హైకోర్టు తీర్పు పై స్టే వస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2022లో ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన దండె విఠల్ ఎన్నిక చెల్లదని హై కోర్టు ప్రకటించింది. ఫోర్జరీ సంతకాలతో దండె విఠల్ తన పేరిట నామినేషన్ ఉపసంహరణ పత్రాలిచ్చారని కాంగ్రెస్ నేత పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దండె విఠల్ ఎన్నిక అక్రమని, ఆయన శాసన మండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని రాజేశ్వర్ రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. తాజాగా దండె విఠల్ ఎన్నిక చెల్లదని తీర్పు వెలువరించింది. ఎన్నిక రద్దు చేయడంతో పాటు దండె విఠల్‌కు న్యాయస్థానం రూ.50,000 జరిమానా విధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే ఢీలాపడ్డ బీఆర్ఎస్‌ హైకోర్టు తాజా తీర్పుతో మరో ఎమ్మెల్సీ స్థానాన్ని కోల్పోయింది.

Article Categories:
రాజకీయాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *