banner

హైదరాబాద్ మెట్రో: క్రికెట్ ప్రేమికులకు శుభవార్త!

Written by

క్రికెట్ ప్రేమికులకు హైదరాబాద్ మెట్రో యాజమాన్యం శుభవార్త అందించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈరోజు ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో మెట్రో సేవలు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ రోజు రాత్రి ఒంటిగంట వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. రాత్రి 12:15 గంటలకు చివరి ట్రైన్ ప్రారంభమై.. 1:10 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుందని పేర్కొన్నారు. అయితే ఉప్పల్ స్టేడియం – ఎన్జీఆర్‌ఐ స్టేషన్లలో మాత్రమే ప్రవేశానికి అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. ఉప్పల్ మార్గంలోని మిగతా స్టేషన్లలో ట్రైన్ దిగే వారికే అనుమతి ఉంటుందని.. ఎక్కడానికి మాత్రం వీలుండదని స్పష్టం చేశారు. కాగా, ఇవాళ ఉప్పల్లో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. ఇవాళ రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. సన్ రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లలో భారీ హిట్టర్లు ఉండటంతో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం రాజస్థాన్‌ రాయల్స్‌ 9 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మాత్రం 9 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించి ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఈ సీజన్‌లో తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్‌ అనధికారికంగా ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. సన్‌రైజర్స్‌ ప్లే ఆఫ్స్‌ రేసులో ప్రధాన పోటీదారుగా నిలిచింది.

Article Categories:
వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *