
ఎస్టీ హాస్టల్ విద్యార్థులు రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిజామాబాద్ జిల్లాలో ఉండే ఎస్టీ హాస్టల్లో గత రెండేళ్లుగా వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని హాస్టల్ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం భోజనం సరిగ్గా పెట్టడం లేదని, తాగునీరు కూడా సక్రమంగా ఉండట్లేదని ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే నిన్న రోడ్డుపై కుళ్లిన కూరగాయలు పారబోసి హాస్టల్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
Article Categories:
వార్తలు