banner

ప్రమాణస్వీకారం పై స్పందించిన బండి సంజయ్..పవన్‌పై కీలక వ్యాఖ్యలు

Written by

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా ప్రమాణ చేశారు. ఏపీ మంత్రిగా జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయడం పై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఏపీ మంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కల్యాణ్‌కు హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు ట్వీట్ చేశారు. మీ పట్టుదల, సంకల్పమే మీకు ఈ విజయాన్ని అందించాయని తెలిపారు. మీరు ఇలాగే ఎదగాలని..విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు. కేంద్రంలో ప్రధాని మోడీ నాయకత్వంలో, రాష్ట్రంలో చంద్రబాబు సారథ్యంలో ఏపీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండనుందని తెలిపారు. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో ఏపీ ప్రగతికి ఎలాంటి అడ్డంకులు లేవని బండి సంజయ్ అన్నారు.

Article Categories:
రాజకీయాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *