banner

నేడు మృగశిర కార్తె.. చేపల మార్కెట్లలో పెరిగిన రద్దీ

Written by

మృగశిర కార్తె సందర్భంగా చేపలు తినడం పూర్వ కాలం నుంచి ఆనవాయితీగా వస్తుంది. ఈ రోజు ఫిష్ తింటే ఆరోగ్యానికి మంచిదని ప్రజల నమ్మకం. దీంతో మార్కెట్లో పలు రకా చేపలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు గ్రామాల్లో చెరువుల వద్ద గ్రామస్థులు చేపలు కొనేందుకు క్యూ కట్టారు. అందేవిధంగా పట్టణాల్లో మార్కెట్లు అన్ని కిటకిటలాడుతున్నాయి. ఇక హైదరాబాద్‌లోని ముషీరాబాద్, రాంనగర్ చేపల మార్కెట్లలో మృగశిరకార్తె సందర్భంగా పలు ప్రాంతాల నుంచి చేపలు పెద్ద ఎత్తున దిగుమతి అయ్యాయి. మామూలు రోజుల్లో 15 టన్నుల నుంచి 20 టన్నుల చేపల విక్రయాలు జరుగతుండగా మృగశిర కార్తె సందర్భంగా రెండు తెలుగు రాష్ర్టాల నుంచి 50 టన్నుల నుంచి 70 టన్నుల చేపలు సేల్ అవుతాయని వ్యాపారులు తెలిపారు. గురువారం బొచ్చ, రవ్వ కిలో రూ.100 నుంచి 120కి విక్రయిస్తున్నారు. ఇక చిన్న సైజు చేపలు కిలో రూ.100 చొప్పున విక్రయిస్తున్నారు.

Article Categories:
వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *