banner

జూనియర్ కాలేజీలకు పాఠ్యపుస్తకాల పంపిణీపై హరీష్ రావు సంచలన ట్వీట్

Written by

జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడం లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ట్విట్టర్ లో ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో జూనియర్ కళాశాలలు ప్రారంభమై 19 రోజులు అవుతుందని.. ఇప్పటి వరకు పాఠ్య పుస్తకాలు అందించకపోవడం బాధ్యతారాహిత్యం అన్నారు. ప్రజా పాలన అని ప్రచారం చేసుకునే ఈ ప్రభుత్వానికి విద్య మీద, విద్యార్థులు భవిష్యత్తు మీద ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అన్నారు. 422 జూనియర్ కాలేజీల్లో లక్షా 60 వేల మంది పే, బలహీన వర్గాల విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. వారికి నాణ్యమైన విద్య అందించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. రాష్ట్రంలోని కొన్ని జూనియర్ కాలేజీల్లో మొదటి ఏడాది జీరో అడ్మిషన్స్ నమోదవడం పట్ల ప్రభుత్వం దృష్టి సారించి ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడంతో పాటు, జూనియర్ కాలేజీల్లో విధులు నిర్వర్తించే 1654 గెస్ట్ ఫ్యాకల్టీ రెన్యువల్ చేయాలని, రాష్ట్రంలో కొత్తగా మంజూరైన జూనియర్ కాలేజీల్లో పోస్టులు మంజూరు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని బీఆర్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.

Article Categories:
రాజకీయాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *