banner

కేంద్రమంత్రి ఆటకు నెటిజన్లు ఫిదా!.. టీమ్ ఇండియాలో ఎందుకు చేరలేదన్న వ్యాఖ్యలు

Written by

కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి మన్సుక్ మాండవీయ యువకులతో కలిసి క్రికెట్ ఆడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. గుజరాత్ లోని పోరుబందర్ లోక్ సభ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్న మాండవీయ అక్కడ స్థానికులతో కలిసి క్రికెట్ ఆడారు. 51 ఏళ్ల వయసున్న కేంద్రమంత్రి మైదానంలో యువకుడిలా పరిగెడుతూ.. బౌలింగ్, ఫీల్డింగ్ తో పాటు బ్యాటింగ్ కూడా చేశారు. మొదటగా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ చేసిన ఆయన యువకులలో ఉత్సాహం నింపుతూ ఫీల్డింగ్ కు దిగారు. అనంతరం బ్యాట్ పట్టి భారీ షాట్లు ఆడే ప్రయత్నం చేశాడు. చివరగా తనతో కుర్రాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందనలు తెలియజేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. కేంద్రమంత్రి ఆటకు ఫిదా అవుతున్నారు. ఈయన ఇండియన్ క్రికెట్ టీంకు ప్లేయర్ గా ఎందుకు వెళ్లలేదు? అని, ఆరోగ్యశాఖ మంత్రి కనుక ఈ వయస్సులో కూడా ఉత్సాహంగా ఉన్నారేమో అని పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.

Article Categories:
వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *