banner

రంగారెడ్డి జిల్లా కాటేదాన్ ఓ మహిళ దారుణ హత్య.. బండరాయితో మోది కిరాతకంగా.

Written by

రాయితో మోది మహిళను అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని కాటేదాన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాటేదాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ సమీపంలో ఇవాళ ఉదయం ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. అయితే, ఆమెను ఎవరో తలపై బండరాయితో బలంగా కొట్టి చంపినట్లుగా తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ లభించిన ఆధారాల మేరకు మృతురాలు సమీరా ఖాన్‌గా గుర్తించారు. కాగా, ఆమె ప్రియుడే సమీరాను హత్య చేసి ఉండవచ్చని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

Article Categories:
వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *