banner

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్.. ఈడీకి ఫిర్యాదు చేసిన న్యాయవాది సురేష్

Written by

పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైకోర్టు సీనియర్ న్యాయవాది సురేష్ కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీకి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులు పలువురు వ్యాపారస్తుల ఫోన్లను ట్యాప్ చేసి వారిని బెదిరించి కోట్లు వసూల్ చేశారని కంప్లైంట్‌లో పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోలీసు వాహనాల్లో ఓ పార్టీకి డబ్బులు తరలించామని నిందితులు ఇప్పటికే పోలీసుల విచారణలో ఒప్పుకున్నారని.. దీనిని పరిగణలోకి తీసుకుని ఫోన్ ట్యాపింగ్‌పై పీఎంఎల్ఏ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యా్ప్తు చేయాలని ఈడీని ఆయన రిక్వెస్ట్ చేశారు.
కేసులో అసలు నిందితులను ఇప్పటికే వరకు ప్రశ్నించలేదని.. ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే దీనికి వెనకున్న అసలు రాజకీయ బయటకు వస్తారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వెనకున్న వారిని బయటపెట్టాలని కోరారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పెద్ద తలకాయలు అరెస్ట్ అవుతాయని.. సుప్రీం ఆదేశాలతోనే ఫోన్లు ట్యాపింగ్ చేశామనే వార్తలు వినిపిస్తున్న వేళ.. ఈ కేసు ఈడీ వద్దకు చేరడం సంచలంగా మారింది. ఈడీ ఎంట్రీ ఇస్తే ఈ కేసు ఎలాంటి టర్న్ తీసుకుబోతుంది..? ఏ రాజకీయ నేత మెడకు చుట్టుకుంటుంది అనేది ఉత్కంఠగా మారింది.

Article Categories:
వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *