banner

దేశ రాజధానిలో దారుణం.. ఐదేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేసి చంపేశాడు

Written by

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. బవానా ప్రాంతంలో ఐదేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. హత్యానంతరం ఆ వ్యక్తి బాలిక మృతదేహాన్ని ఒక ఫ్యాక్టరీలో దాచిపెట్టాడు. ఈ ఘటన మార్చి 24న జరిగినట్లుగా తెలుస్తోంది. పోలీసులు బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని సమీపంలోని ఆసుపత్రి మార్చురీకి తరలించారు. నిందితుడు ఆ బాలికను ప్రలోభ పెట్టి తనతో తీసుకు వెళ్లాడని పోలీసులు తెలిపారు. ఇదంతా కూడా సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. బవానా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *