banner

కవితను సెక్షన్ 19 ప్రకారమే అరెస్ట్ చేశాం: ఈడీ

Written by

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితను గత మార్చి 15న ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కవిత జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్నారు. అయితే ఆమె కస్టడీ గడువు ముగియడంతో ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో ఆమెను హాజరుపరిచారు. కస్టడీ పొడిగింపు పిటిషన్‌తో పాటు బెయిల్‌ పిటిషన్‌పై కూడా విచారణ జరిగింది. అనంతరం తీర్పును కోర్టు రేపటికి వాయిదా వేసింది. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు బెయిల్ పిటిషన్‌పై విచారణ కొనసాగనుంది. కవితకు బెయిల్ ఇవ్వొందంటూ ఈడీ వాదనలు వినిపించాయి. కవితను చట్టబద్ధంగానే సెక్షన్ 19 ప్రకారమే అరెస్ట్ చేశామని ఈడీ పేర్కొంది. కవిత తరపున న్యాయవాది నితేష్ రానా వాదనలు వినిపించగా… ఈడీ తరపున లాయర్ జోయబ్ హుస్సేన్ వినిపించారు. ఈడీ వాదనల అనంతరం ఈ కేసుపై విచారణను కోర్టు రేపటికి (బుధవారం) వాయిదా వేసింది. రేపు కూడా వాదనలు కొనసాగనున్నాయి. రేపు మధ్యాహ్నం ఇరువురి వాదనలు రౌస్ అవెన్యూ కోర్టు విననుంది.

Article Categories:
వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *