ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మే నెలకు ముందే ఈ రీతిలో ఎండలు దంచికొట్టడంతో జనాలు అప్రమత్తంగా ఉండాలని.. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనాలు బయటికి వెళ్లాలంటే ఇబ్బందిపడుతున్నారు. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్రానికి గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో త్వరలో వర్ష సూచన ఉందని, ఎండల నుంచి కాస్త ఉపశమనం దొరుకుతుందని తెలిపింది. 7, 8 తేదీల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
Article Categories:
వార్తలు
