
నగరంలో డ్రగ్స్, గంజాయిని పూర్తిగా నిర్మూలించేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. దీంతో నగరంలోని జంక్షన్లు, చెక్‌పోస్టులు, పబ్‌లు, క్లబ్‌లలో విస్తృత తనిఖీలు నిర్వహించనున్నారు. నిత్యం ఎక్కడో ఒకచోట పోలీసులు డ్రగ్స్, గంజాయిని పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ డ్రగ్స్ తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఎల్బీ ఎస్‌వోటీ, పోలీసులు చేపట్టిన జాయింట్ ఆపరేషన్‌లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టైంది. నగరంలో వివిధ ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన ముఠా, కస్టమర్లపై పోలీసులు దాడులు చేశారు. ఈ మేరకు వారి నుంచి 1.5 కేజీల ఓపీఎం, 24 గ్రాముల హెరాయిన్, 5 కేజీల మేర పోపీస్ట్రా డ్రగ్స్ పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా నలుగురు డ్రగ్స్ వ్యాపారులు, ముగ్గురు కస్టమర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
Article Categories:
వార్తలు