banner

పవన్ కళ్యాణ్ గెలుపు..ఎమోషనల్ అయిన మెగా ఫ్యామిలీ

Written by

ఏపీలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం పైనే అందరి దృష్టి ఉంది. అయితే గతంలో రెండు చోట్ల ఓటమి చెందిన పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి వంగా గీత పై పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ సంచలనంగా మారారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపొందడం పై ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గెలుపోందాలని మెగా ఫ్యామిలీ మెంబర్స్ ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాలను పిఠాపురంలో లైవ్ స్క్రీన్‌పై చూసిన పవన్ సోదరుడు నాగబాబు, ఆయన సోదరి సంతోషంతో కన్నీరు పెట్టారు. ఇతర పార్టీ శ్రేణులు పవన్ గెలుపు పై హర్షం వ్యక్తం చేస్తూ మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.

Article Categories:
రాజకీయాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *