
బిజినపల్లి మండల కేంద్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చేతులు కడుక్కోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన బిజినపల్లి మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…బిజినపల్లి మండల కేంద్రంలో దర్గా మహబూబ్ అలీ చిస్తీ దర్గా వద్ద కందూరు చేయడానికి వెళ్లి భోజనాలు ముగించుకొని పక్కనే వ్యవసాయ పొలంలో నీటి సంపులో చేతులు కడుక్కోవడానికి ముగ్గురు అన్నదమ్ముల పిల్లలు వెళ్లగా అదుపుతప్పి ముగ్గురు సంపు లో పడ్డారు. అందులో ఫుర్ఖాన్, (12)మొహమ్మద్ (10) ఇద్దరు మృతి చెందారు. నీటి గుంతలో పడటంతో కొంత సమయానికి గమనించిన తల్లిదండ్రులు ముగ్గురిలో ఒకరిని కాపాడారు. వీరి స్వగ్రామం బిజినపల్లి కాగా చాలా ఏళ్ల క్రితం జడ్చర్లలో స్థిరపడ్డారు. ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Article Categories:
వార్తలు
