
నిజామాబాద్ జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్దాం. మహాజన్ బాలాజీ తండ్రి విఠల్ వడ్డీ వ్యాపారి. మంగళవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో సరుకులు కొనుగోలు చేసేందుకు మార్కెట్‌కు వెళ్లాడు. రాత్రి 8.45 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. బీరువా కూడా తెరిచి ఉంది. అయితే బీరువాలో ఉంచిన 25 తులాల బంగారం, రూ.16 వేల నగదును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. బంగారం విలువ రూ.13 లక్షలు ఉంటుందని తెలిపారు. అలాగే రూ.16 వేల నగదును ఎత్తుకెళ్లినట్టుగా బాధితుడు విఠల్ తెలిపాడు. ఎస్సై శ్రీకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతామని తెలిపారు.
Article Categories:
వార్తలు
