
హైదరాబాద్‌లో గంజాయి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సౌత్ వెస్ట్ జోన్ పోలీసులు నిందితుల నుంచి రూ.60 లక్షల విలువైన 164 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రెండు కేసుల్లో ఆరుగురు వ్యక్తుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు ధరావత్ రవిపై గతంలో కూడా పోలీసు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయిని తరలిస్తుండగా పక్కా సమాచారంతో దాడులు చేసి పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Article Categories:
వార్తలు