
ఐపీఎల్ 2024లో భాగంగా జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే.ఈ మ్యాచ్ లో విరాట్ 100 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ఐపీఎల్లో 7500 పరుగులు చేసిన ఏకైక ఆటగాడు కోహ్లీ నిలిచాడు. అయితే అనూహ్యంగా నిన్నటి మ్యాచ్లో రాజస్థాన్ గెలవడంతో విరాట్ కోహ్లీ సెంచరీ వృథా అయింది. మిగతా బ్యాట్స్మెన్ సహకరించకపోవడంతో.. బౌలర్లు తేలిపోవడంతో రాజస్థాన్ సులభంగా విజయం సాధించింది. అయితే ఐపీఎల్ మ్యాచ్కు ముందు విరాట్ కోహ్లీ చేయించుకున్న హెయిర్ స్టైల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. విరాట్ కోహ్లీ చేయించుకున్న హెయిర్ స్టైల్ ఖరీదు రూ. 1 లక్ష వరకు ఉంటుందని వార్త నెట్టింట వైరల్ అవుతోంది. హెయిర్ స్టైల్ కు లక్ష రూపాయలా? అంటూ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
Article Categories:
క్రీడలు