banner

కొత్త ఇంటి గృహప్రవేశం చేసిన రాశి కన్నా..

Written by

తెలుగు చిత్ర పరిశ్రమలో నటి రాశీఖన్నా అంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ చాలా తెలుగు సినిమాల్లో నటించింది. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన మాస్టర్స్ ఇక్కడ కనిపిస్తారు. ఇప్పటికి చాలా మంది హీరోయిన్లు ఇక్కడే సెటిల్ అయి బిజీగా ఉన్నారు. తెలుగు రాని వాళ్లు నేర్చుకొని తెలుగు సినిమాలు చేస్తున్నారు. కొంతమంది హైదరాబాద్‌లో ఇళ్లు కొని ఇక్కడే నివాసం ఉంటున్నారు. తాజాగా ఈ జాబితాలో హీరోయిన్ రాశిఖన్నా కూడా చేరింది. హైదరాబాద్ లో పెద్ద ఇల్లును కొనుగోలు చేసింది. కుటుంబ సభ్యులతో కలిసి కొత్త ఇంటి గృహప్రవేశ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మకి హైదరాబాద్ లో రెండు పెద్ద ఇల్లులు ఉన్నట్లు తెలిసిన సమాచారం. ఆమెకు రెండు ఇల్లు ఉన్నాయి ఇప్పుడు మరొక ఇల్లు కొనుగోలు చేసింది. ఇటీవల తన తల్లి, సన్నిహితులతో కలిసి ఇంట్లోకి ప్రవేశించింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సినిమాల గురించి మాట్లాడుతూ, రాశిఖన్నా ప్రస్తుతం తెలుగులో తెలుసు కదా అనే చిత్రంలో నటిస్తోంది. అలాగే తమిళ చిత్రాలను కూడా చేస్తుంది. దీంతో పాటు ఓ బాలీవుడ్ చిత్రానికి కూడా సంతకం చేశారు.

Article Categories:
సినిమా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *