banner

ఓటరు కార్డు లేకున్నా ఓటేయొచ్చు..ఎలా అంటే?

Written by

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్లలో కొన్ని సందేహాలు తలెత్తుతున్నాయి. వాళ్లు… ఓటర్ ఐడీ లేకపోతే ఓటు వేయలేమని కొందరు అనుకుంటారు. ఈ విషయానికై ఈసీ నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. అర్హుడైన ఏ ఒక్క భారత పౌరుడు కూడా ఓటర్ కార్డు లేదన్న కారణంతో ఓటు వేసే హక్కు కోల్పోరాదు అని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర పోలింగ్‌ అధికారులకు కొన్ని సూచనలు చేశారు.
ఈసీ మార్గదర్శకాలు..ఏంటంటే?
*ఓటర్ ఐడీలో అక్షరదోషాలు, క్లరికల్‌ దోషాలు ఉన్నా వాటిని విస్మరించి ఓటు వేసే హక్కు కల్పించాలని ఆదేశించింది.
*ఒక వేళ ఓటరు కార్డులోని ఫొటో సరిపోలకపోతే ఓటరు మరో ప్రత్యామ్నాయ ఫొటో డాక్యుమెంట్‌ను ఆధారంగా చూపి తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఇవ్వాలని సూచించింది.
*ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటరు ఐడీ కార్డు లేని వారు, లేదా తీసుకురాని వారు ప్రత్యామ్నాయ ఫొటో ఐడీని గుర్తింపు రుజువుగా సమర్పించవచ్చని ఆ ప్రకటనలో పేర్కొంది.

Article Categories:
వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *