banner

TS DSC Application Last Date: నేటితో ముగుస్తున్న ‘డీఎస్సీ’ దరఖాస్తు గడువు

Written by

టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ దరఖాస్తు గడువు నేటితో (గురువారం) ముగియనుంది. ప్రభుత్వం 1,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చింది. ఏప్రిల్ 3నాటికే గడువు ముగియాల్సి ఉండగా మార్చిలో టెట్ నోటిఫికేషన్ ఇవ్వడంతో అప్లికేషన్ల గడువును జూన్ 20 వరకు పొడిగించింది. ఈ రోజు రాత్రి 11.50 గంటల వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. జూన్ 19న సాయంత్రం నాటికి 2,72,798 మంది అభ్యర్థులు ఫీజు చెల్లించగా.. ఇందులో 2.64 లక్షల మంది దరఖాస్తులు సమర్పించారు. అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునేవారు, ప్రతి ఉద్యోగం కోసం రూ.1000 అదనంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జూలై 17 నుంచి 31 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను tsdsc.aptonilne.in/tsdsc/ సందర్శించండి.

Article Categories:
వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *