
క్రికెట్ అభిమానులకు శుభవార్త. టీఎస్ఆర్ టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆసక్తికర ట్వీట్ చేశారు. హైదరాబాద్ లో జరగబోయే మ్యాచ్ కోసం 60 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు దీనికి సంబందించిన వీడియోను ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. ఇవ్వాళ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగబోయే ఐపీఎస్ మ్యాచ్ కు మీ సోంత వాహానాల్లో వెళ్లి ట్రాఫిక్ అంతరాయానికి కారణం కాకండి అని సూచించారు. అలాగే ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకుని సాధారణ వాహనదారులకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టాలని తెలిపారు. ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వెళ్లే క్రికెట్ అభిమానుల కోసమే హైదరాబాద్ లోని ప్రధాన ప్రాంతాల నుంచి 60 ప్రత్యేక బస్సులను ఉప్పల్ స్టేడియానికి టీఎస్ ఆర్టీసీ నడుపుతోందని, ఈ బస్సులు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై.. తిరిగి రాత్రి 11:30 గంటలకు స్టేడియం నుంచి బయలుదేరుతాయని తెలియజేశారు. వీటిని ఉపయోగించుకుని క్షేమంగా స్టేడియానికి వెళ్లి క్రికెట్ మ్యాచ్ ని వీక్షించాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం క్రికెట్ అభిమానులను కోరుతోంది అని వీసీ సజ్జనార్ సమాచారం అందించారు.

