banner

సికింద్రాబాద్‌లో కాల్పుల కలకలం

Written by

హైదరాబాద్‌లో కాల్పులు కలకలం రేపుతున్నాయి. సికింద్రాబాద్ లో ఈ కాల్పులు జరిగినట్లు తెలుస్తుంది. చిలకలగూడలో సెల్ ఫోన్ స్నాచింగ్ ముఠా హంగమా సృష్టించింది. ఈ క్రమంలో ఆ ముఠా సెల్ ఫోన్ దొంగతనం చేస్తుండగా పోలీసులు చూశారు. వెంటనే వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అది గమనించిన దొంగల ముఠా వారి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీస్ కానిస్టేబుల్ తన వద్ద ఉన్న తుపాకితో ఒక రౌండ్ కాల్పులు జరిపారు. దీంతో దొంగల ముఠా భయంతో నిలిచిపోగా పోలీసులు మొత్తం ముగ్గురు అదుపులోకి తీసుకుని పారిపోయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కానిస్టేబుల్ తుపాకీ పేల్చడం తో స్థానిక ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *