
హైదరాబాద్ లోని వెస్ట్ ఇన్ హోటల్ ఏర్పాటు చేసిన బొగ్గు గనుల వేలం ప్రక్రియను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలోని అన్ని పరిశ్రమలకు బొగ్గు ప్రాణాధారంగా ఉందని.. బొగ్గు లేనితే విద్యత్ ఉత్పత్తి సాధ్యం కాదని.. తెలంగాణ ప్రాంతంలో లభించే బొగ్గుకు డిమాండ్ ఉందని.. ఇది కోల్ కాదు.. బ్లాక్ గోల్డ్ అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చడానికి ఈ వేలం వేస్తున్నామని.. మార్కెట్ లో బొగ్గుకు విపరీతమైన డిమాండ్ ఉందని అన్నారు. అలాగే ఒక్కప్పుడు హైదరాబాద్ నగరంలోని పారిశ్రామిక వేత్తలు కరెంట్ కోసం ఆందోళన చేసేవారని కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని.. వ్యవసాయం, కమర్షియల్, గృహ అవసరాలకు తగినంత రాష్ట్రంలో అందుబాటులో ఉందని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. 2024-25 ఆర్ధిక సంవత్సరంలో ఒక బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని.. ప్రపంచంలో బొగ్గు ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో ఉందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు.

