banner

తెలంగాణ ప్రజలకు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ శుభవార్త చెప్పారు

Written by

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శుభవార్త అందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి రాజనర్సింహ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్తగా 75 ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. డయాగ్నస్టిక్ సెంటర్లను ప్రభుత్వ ఆసుపత్రులకు అనుసంధానం చేస్తామని పేర్కొన్నారు. గవర్నమెంట్ ఆసుపత్రుల్లో నిరంతర పర్యవేక్షణకు మూడు రకాల టాస్క్‌ఫోర్స్ టీమ్‌లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక వసతుల కోసం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వైద్య రంగంలో రెగ్యులేటరి పవర్స్‌ను అమలు చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైద్య శాఖలో ప్రక్షాళన మొదలైందని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఉస్మానియా ఆస్పత్రిని పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు.

Article Categories:
రాజకీయాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *