
కొండాపురం అంజి(26) అనే వ్యక్తి గద్వాల రైల్వే స్టేషన్ పరిధిలోని పాత హౌసింగ్ బోర్డు సమీపంలో గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ తెలిపారు. కేటిదొడ్డి మండలం శివరంగాపురం గ్రామానికి చెందిన అంజి కర్నూల్‌కు చెందిన ఓ వ్యక్తితో కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గద్వాల పట్టణానికి చెందిన ఓ మహిళతో అంజికి వివాహాం జరిగింది. అయితే, భార్య గర్బవతి కావడంతో ప్రస్తుతం పుట్టింట్లోనే ఉంటుంది. శుక్రవారం తెల్లవారుజామున గద్వాల పట్టణం పాతహౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలో గల రైలు పట్టాలపై గుర్తు తెలియని రైలు కింద పడి అంజి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు గద్వాల పోలీసులు తెలిపారు. కాగా, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

