
రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో ఎంఏ, ఎంకాం, ఎమ్మె్స్సీతో పాటు ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీపీగెట్ నకు లేట్ ఫీజు లేకుండా గడువు జూన్ 17తో ముగియనుంది. కాగా, జులై 5న పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రసాయన, జంతు, వాణిజ్య శాస్త్రాలకు ఒక్కో దానికి నాలుగు వేలకు పైగా దరఖాస్తులు అందినట్లు కన్వీనర్ ప్రొ.పాండురంగారెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 52 వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు లేట్ ఫీజు లేకుండానే దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
Article Categories:
వార్తలు
