
జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్ అన్మోల్ ఖర్బ్ కజకిస్థాన్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్ లో దూసుకుపోతుంది. కజకిస్థాన్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్ లో మహిళల సింగిల్స్ లో ప్రీక్వార్టర్స్ లోకి ఎంటరయ్యింది ఈ భారత యువ షెట్లర్ . భారత్ కు చెందిన మరో యువ షెట్లర్ మాళవిక బన్సోద్ పై పోరాడి ప్రీక్వార్టర్స్ కు చేరింది. అన్మోల్ 21-13, 22-20 తేడాతో మాళవికను ఓడించింది. దాదాపు గంటపు హోరాహోరీగా మ్యాచ్ సాగింది. ప్రీక్వార్టర్స్ లో అన్మోల్ ఇండోనేషియాకు సేచెందిన నురాని రతు అజహ్రాతో తలపడనుంది. తొలి క్వాలిఫికేషన్ రౌండ్లలో మలేషియాకు చెందిన కాస్సీ రిన్ రోంపోగ్ ను 21-19, 21-9 తేడాతో ఓడించి మెయిన్‌డ్రాలో చోటు దక్కించుకుంది. రెండో రౌండ్ లో కజకిస్థాన్ కు చెందిన కిలా స్మాగులోవా వాకోవర్ చేయగా.. సునాయాసనంగా మరో రౌండ్ కు చేరింది అన్మోల్. మహిళల సింగిల్స్ ప్రీ-క్వార్టర్‌ఫైనల్స్‌లోఅనుపమ ఉపాధ్యాయ 21-13, 21-13తో క్వాలిఫయర్ హర్షిత రౌత్ ను ఓడించింది. తాన్యా హేమంత్ 21-19, 21-10తో క్వాలిఫయర్ ఇషానీ తివారీపై విజయం సాధించింది. కెయురా మోపాటి 21-18, 21-13తో మెక్సికోకు చెందిన వెనెస్సా మారిసెలా గార్సియాపై గెలుపొందింది. పోలాండ్ కు చెందిన విక్టోరియా వాకోవర్ చేయగా.. క్వాలిఫయర్ అనెరి కోటక్ తదుపరి రౌండ్‌లోకి దూసుకెళ్లింది.