
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మద్యం అక్రమాస్తుల కేసులో కవిత బెయిల్ పిటిషన్‌ను రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టు నేడు విచారించనుంది. ఈ కేసులో మధ్యంతర, సాధారణ బెయిల్ కోసం బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దరఖాస్తు చేసుకున్నారు. తన కుమారుడి పరీక్షలను పేర్కొంటూ ఈ నెల 16వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత తన పిటిషన్‌లో కోరారు. ఈడీ కస్టడీ ముగియడంతో కవిత విడిగా బెయిల్ దరఖాస్తు కూడా చేసుకున్నారు. అయితే కవిత బెయిల్ దరఖాస్తును ఈడీ తిరస్కరించింది. కవిత బయటకు వస్తే సాక్ష్యాలు తారు మారు చేసే ప్రమాదం ఉందని ఈడీ కోర్టుకు తెలిపింది. ఈ కేసులో మరికొందరిని కూడా విచారించామని ఈడీ కౌంటర్ ఇచ్చింది. ఈడీ కౌంటర్‌కు రిజాయిండర్ వేసేందుకు కవిత న్యాయవాదులు సమయం కోరారు. ఇక, ఢిల్లీ మద్యం కేసులో గత నెల 15న కవితను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 10 రోజుల కస్టడీ తర్వాత జ్యుడీషియల్ కస్టడీకి సీబీఐ కోర్టు పంపింది.