banner

తెలంగాణ కొత్త ఎంపీలకు పార్టీ చీఫ్ ఖర్గే గ్రాండ్ డిన్నర్

Written by

తెలంగాణలో రేపు కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ సభ్యులకు విందు ఏర్పాటు చేస్తున్నట్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎంపీలకు టీపీసీసీ సమాచారం అందించింది. దీంతో తెలంగాణ నుంచి గెలిచిన ఎనిమిది మంది ఎంపీలు ఈ విందు పార్టీకి రానున్నారని తెలిసింది. దీంతో పాటు రేపు మధ్యాహ్నం తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుండగా.. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో సహా సీడబ్ల్యూసీ సభ్యులు, ఏఐసీసీ నేతలు, సీనియర్ నేతలు హాజరుకానున్నారు. వారు కూడా విందుకు హాజరయ్యే యోచనలో ఉన్నట్లు పార్టీ అధికారులు తెలిపారు.

రేపు సీడబ్ల్యూసీ మీటింగ్

జూన్ 8న ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం కాబోతోంది. రేపు ఉదయం 11:30 గంటలకు సమావేశం నిర్వహించబోతున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత తొలిసారి సమావేశం కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది.

Article Categories:
రాజకీయాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *